జమ్మూకశ్మీర్‌లో బస్సు అదుపుతప్పి ఆక్నూర్ సెక్టార్ సమీపంలోని లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ప్రయాణికులు జమ్మూ నుంచి రియాసి జిల్లాలోని శివ్ ఖోరీ మందిరానికి బస్సులో వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు జమ్మూ-పూంచ్ హైవేపై చుంగీ మోర్హ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.
బస్సు లోయలో పడి 15 మంది దుర్మరణం
الخميس، 30 مايو 2024
28 మందికి తీవ్ర గాయాలయ్యాయి J&K national బస్సు జమ్మూ-పూంచ్ హైవేపై చుంగీ మోర్హ్ సమీపంలోకి రాగానే బస్సు లోయలో పడి 15 మంది దుర్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق