ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ద్వేషపూరిత, అన్‌పార్లమెంటరీ ప్రసంగాలు చేయడం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని నరేంద్ర మోడీ తగ్గించారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఏప్రిల్‌లో రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు. జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ ప్రజలకు లేఖను రాశారు మన్మోహన్ సింగ్. అందులో నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై అయన విమర్శలు చేశారు. ప్రధాని మోడీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలని అన్నారు. మోడీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయిందని అన్నారు. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. రైతులను ప్రధాని మోడీ అవమానించారని మన్మోహన్ సింగ్ ఆరోపించారు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని తగ్గించారు !
الخميس، 30 مايو 2024
national అన్‌పార్లమెంటరీ ప్రసంగాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని తగ్గించారు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ద్వేషపూరిత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ليست هناك تعليقات:
إرسال تعليق