దీపావళి పండుగ సందర్భంగా హోండా కంపెనీ బైక్స్ & స్కూటర్స్‌పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్‌బ్యాక్స్ ప్రకటించింది. హోండా బైక్స్, స్కూటీస్ కొన్నవారికి రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ, నో హైపోథికేషన్ బెనిఫిట్స్ అందిస్తోంది. పైగా అతి తక్కువ వడ్డీ రేటు (6.99%)తో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది. హోండా 'సీబీ300ఆర్' బైక్‌ను లాంఛ్ చేసింది. దీని మార్కెట్ ధర రూ.2.40 లక్షలు వరకు ఉంటుంది. అయితే ఈ దీపావళి పండగ సీజన్లో ఈ బైక్‌ను రూ.37,000 తగ్గింపు ధరతో అందిస్తోంది.ఈ బైక్‌లో 286సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9000 ఆర్పీఎం వద్ద 29.98 బీహెచ్పీ పవర్; 7500 ఆర్పీఎం వద్ద 27.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. వాస్తవానికి హోండా కంపెనీ ఈ సీబీ300ఆర్ బైక్‌ను.. బజాజ్ డోమినార్ 400, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్310, కెటీఎం 390 డ్యూక్, బీఎండబ్ల్యూ జీ310ఆర్ బైక్‌లకు పోటీగా తీసుకొచ్చింది. ఇటీవలే యాక్టివా న్యూ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిలో పలు కాస్మెటిక్ మార్పులు కూడా చేసింది. స్టాండర్డ్ వేరియంట్ యాక్టివా ధర రూ.80,734, స్మార్ట్ వేరియంట్ యాక్టివా ధర రూ.82,734. ఈ దీపావళి పండుగ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని.. పైగా పలు షరతులు కూడా వర్తిస్తాయని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా స్పష్టం చేసింది.
హోండా 'సీబీ300ఆర్' బైక్‌పై రూ.37,000 డిస్కౌంట్ !
الاثنين، 30 أكتوبر 2023
000 డిస్కౌంట్ automobile science technology ఆఫర్స్ క్యాష్‌బ్యాక్స్ డిస్కౌంట్స్ హోండా 'సీబీ300ఆర్' బైక్‌పై రూ.37
ليست هناك تعليقات:
إرسال تعليق