దీపావళి పండుగ సందర్భంగా హోండా కంపెనీ  బైక్స్ &​ స్కూటర్స్​పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్​బ్యాక్స్​ ప్రకటించింది. హోండా బైక్స్​, స్కూటీస్​​ కొన్నవారికి రూ.5,000 వరకు క్యాష్​బ్యాక్​, జీరో డౌన్​ పేమెంట్​, నో కాస్ట్ ఈఎంఐ, నో హైపోథికేషన్​ బెనిఫిట్స్ అందిస్తోంది. పైగా అతి తక్కువ వడ్డీ రేటు (6.99%)తో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది. హోండా 'సీబీ300ఆర్' బైక్​ను లాంఛ్ చేసింది. దీని మార్కెట్​ ధర రూ.2.40 లక్షలు వరకు ఉంటుంది. అయితే ఈ దీపావళి పండగ సీజన్​లో ఈ బైక్​ను రూ.37,000 తగ్గింపు ధరతో అందిస్తోంది.ఈ బైక్​లో 286సీసీ సింగిల్ సిలిండర్​ ఇంజిన్​ను అమర్చారు. ఇది 9000 ఆర్​పీఎం వద్ద 29.98 బీహెచ్​పీ పవర్; 7500 ఆర్​పీఎం వద్ద 27.5 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. వాస్తవానికి హోండా కంపెనీ ఈ సీబీ300ఆర్​ బైక్​ను.. బజాజ్​ డోమినార్​ 400, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​310, కెటీఎం 390 డ్యూక్​, బీఎండబ్ల్యూ జీ310ఆర్​ బైక్​లకు పోటీగా తీసుకొచ్చింది. ఇటీవలే యాక్టివా న్యూ లిమిటెడ్ ఎడిషన్​ను విడుదల చేసింది. దీనిలో పలు కాస్మెటిక్ మార్పులు కూడా చేసింది. స్టాండర్డ్ వేరియంట్ యాక్టివా ధర రూ.80,734, స్మార్ట్ వేరియంట్ యాక్టివా ధర రూ.82,734. ఈ దీపావళి పండుగ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని.. పైగా పలు షరతులు కూడా వర్తిస్తాయని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా స్పష్టం చేసింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ