నిస్సాన్ ఇండియా అందిస్తున్న మ్యాగ్నెట్ కారుపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. కంపెనీ ఈ నెలలో కారుపై ఏకంగా రూ. 97,100 వరకు తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. ఇందులో పీఎంపీ ఆఫర్ కింద రూ. 12,100 వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా యాక్ససిరీస్ లేదా క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 20 వేల వరకు తగ్గింపు ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 40 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేల వరకు తగ్గింపు ఉంది. ఇలా మొత్తంగా రూ. 97 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ కారు కొనేందుకు సులభంగానే లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. వడ్డీ రేటు 6.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. నిస్సాన్ ఫైనాన్స్ ద్వారా ఈ ఫెసిలిటీ పొందొచ్చు. 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.డీల్స్ ఈ నెల వరకే అందుబాటులో ఉంటుంది. ఎంచుకునే కారు వేరియంట్ ఆధారంగా కూడా కారు ఆఫర్‌లో మార్పులు ఉంటాయి. అలాగే డీలర్‌షిప్ ఆధారంగా కూడా కారు ఆఫర్ మారొచ్చు. ఈ కారు ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
మ్యాగ్నెట్ కారుపై భారీ తగ్గింపు ఆఫర్లు !
Sunday, September 17, 2023
automobile science techology ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 40 వేల వరకు డిస్కౌంట్ మొత్తంగా రూ. 97 వేల వరకు డిస్కౌంట్ మ్యాగ్నెట్ కారుపై భారీ తగ్గింపు ఆఫర్లు
No comments:
Post a Comment