పది నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ?

السبت، 11 فبراير 2023

realme Realme GT Neo 5 science smart phones technologe పది నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ?

t f B! P L


స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా ఛార్జ్ కావడానికి కనీసం గంట నుంచి మూడు గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చినవి అయితే, బ్యాటరీ ఫుల్ కావడానికి కనీసం 40 నిమిషాలైనా ఛార్జింగ్ పెట్టాలి. అయితే కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది..? చైనాకు చెందిన రియల్‌మీ సంస్థ ఈ ఫీచర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. రోజువారీ జీవితంలో స్మార్ట్‌ఫోన్ ప్రాధాన్యత అమాంతంగా పెరిగిపోయింది. కెరీర్, ఎడ్యుకేషన్, పర్సనల్.. ఇలా దాదాపు అన్ని రకాలుగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఛార్జింగ్ అయిపోయాక మళ్లీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి కాస్త సమయం పడుతోంది. ఈ సమస్యను నివారించడంపై ఫోన్ల తయారీ కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే చైనా కంపెనీ రియల్‌మీ నూతన స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకునే 'Realme GT Neo 5' ఫోన్‌ను రియల్‌మీ రూపొందించింది. 240వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేయగలదని కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఫోన్‌ను పరిచయం చేస్తున్నట్లు రియల్‌మీ వెల్లడించింది. 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే ఫోన్ ఇప్పటివరకు మార్కెట్లోకి రాలేదని తెలిపింది. ఇది తొలి 4 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుందని, 10 నిమిషాల్లోపే 100శాతం పూర్తయిందని రియల్‌మీ ప్రకటించింది. 240వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీ వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేసింది. 'GT Neo 5'లో mAh లిథియం-పాలిమర్(Li-Po) బ్యాటరీని అమర్చినట్లు తెలిపింది. అయితే, ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ. త్వరగా ఛార్జ్ చేసుకున్నప్పటికీ.. బ్యాటరీ బ్యాకప్ ఎంత సేపు వస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. 240వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో పాటు 150వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో రియల్‌మీ మరో ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mahగా ఉండనుంది. పది నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఇందులో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. 240వాట్ల కెపాసిటీని ఇచ్చే పవర్‌ఫుల్ అడాప్టర్‌ కావాల్సి ఉంటుంది. దీనికి బలమైన సీ కేబుల్‌ను రూపొందించాలి. అంత కెపాసిటీని తట్టుకునేలా అడాప్టర్, కేబుల్‌ తీసుకురావాలి. ఈ ఫోన్ బ్యాటరీకి వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో లేదు. వీటితో పాటు 144Hz రిఫ్రెషింగ్ రేట్, ఆక్టా కోర్ ప్రాసెసర్‌లు బ్యాటరీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియాలంటే వేచి చూడాలి. ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ఫీచర్లన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. దీంట్లో 50MP, 8MP, 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటితో 4K, 1080p రెజల్యూషన్‌తో వీడియోలను తీయొచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ