దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఇండియాలో అన్ని దరల విభాగాలలో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల థ శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ను మిడ్ రేంజ్ విభాగంలో గత వారం లాంచ్ చేసింది. ఈ ఫోన్ నేడు మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. శామ్‌సంగ్ సంస్థ నుండి మిడ్-టైర్ విభాగంలో 5G కనెక్టివిటీతో రెండు కాన్ఫిగరేషన్‌లతో పాటు రెండు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతున్న ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ SoC ద్వారా రన్ అవుతూ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఇప్పుడు కొనుగోలు చేయడానికి రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.20,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.22,999. ఈ ఫోన్ స్లేట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్ లలో ఈరోజు నుంచి అమెజాన్ మరియు Samsung.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి నో-కాస్ట్ EMI లావాదేవీలతో పాటుగా రూ.2,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా లభిస్తుంది. శామ్‌సంగ్ వెబ్‌సైట్ నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.
గెలాక్సీ M32 5G మొదటి సేల్ డిస్కౌంట్
الخميس، 2 سبتمبر 2021
business science technologe గెలాక్సీ M32 5G మొదటి సేల్ డిస్కౌంట్
ليست هناك تعليقات:
إرسال تعليق