వాట్సాప్ పేమెంట్స్ పేరిట ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థని ప్రారంభించిన ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానున్నట్లు సమాచారం. తమ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను ప్రోత్సహించేలా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత వాట్సాప్ బీటా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమచారం. అయితే, ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుందా లేక తొలిసారి పేమెంట్ చేసేవారికి మాత్రమే వర్తిస్తుందా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనిపై వాట్సాప్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని వాట్సాప్ బీటా తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం యూపీఐ పేమెంట్స్‌కి మాత్రమే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వాట్సాప్ పేమెంట్స్‌లో త్వరలో క్యాష్‌బ్యాక్ ఆఫర్?
الجمعة، 24 سبتمبر 2021
science technologe WhatsApp వాట్సాప్ పేమెంట్స్‌లో త్వరలో క్యాష్‌బ్యాక్ ఆఫర్?
ليست هناك تعليقات:
إرسال تعليق