ホーム
/
west bengal
/
మమతా బెనర్జీకి తగిలిన కాలు గాయం నిజమైనది కాదు : సమగ్ర విచారణ జరిపిస్తామన్న ముఖ్యమంత్రి సువేందు అధికారి
Saturday, October 3, 2026
a comprehensive inquiry will be conducted: Suvendu Adhikari Mamata Banerjee's leg injury was not genuine Nandigram during the 2021 Assembly election campaign was not real west bengal
2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిగ్రామ్‌లో నాటి సీఎం మమతా బెనర్జీకి తగిలిన కాలు గాయం నిజమైనది కాదని, అది పూర్తిగా డ్రామా అని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 మార్చి 10న నందిగ్రామ్‌లోని విరులియా బజార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మమతా బెనర్జీ కాలుకు గాయమైంది. జనాల గుంపు మధ్య కారు తలుపు బలంగా తగలడం వల్ల ఆమె ఎడమ పాదం, మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయయి అప్పట్లో తెలిపారు. అయితే, ఆ గాయం పూర్తిగా కట్టుకథ అని సువేందు అధికారి ఆరోపించారు. అప్పట్లో కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో మమతా బెనర్జీకి చేసిన వైద్య పరీక్షల తాలూకు ఒరిజినల్ రిపోర్ట్ తన దగ్గర ఉందని ఆయన తెలిపారు. ఆ రిపోర్ట్‌లో వైద్యులు ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని స్పష్టంగా రాశారని, కానీ ఆమె ఆరోగ్యంగా ఉన్న కాలికి ప్లాస్టర్ వేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. నందిగ్రామ్ ప్రాంతాన్ని, స్థానిక ప్రజలను ఈ ఘటన ద్వారా కించపరిచారని మండిపడ్డ ఆయన, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ అబద్ధపు ప్రచారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆ గాయం తర్వాత మమతా బెనర్జీ వీల్‌చైర్‌పైనే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం, ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం పొలిటికల్‌గా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి రావడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
No comments:
Post a Comment