ఆసియా క్రీడలు : హాకీలో పురుషుల జట్టుకు స్వర్ణం : పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరిన భారత్
Saturday, October 3, 2026
Asian Games: Men's Hockey Team Wins Gold India Moves to Fourth Place in Medal Tally India routed Malaysia 5-1 national sports
ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణం నిలబెట్టుకుంది. శనివారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 తేడాతో మలేషియాను చిత్తు చేసింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ డబుల్ గోల్స్‌తో మెరవగా, జుగ్‌రాజ్ సింగ్, హార్దిక్, శిలానంద్ తలా ఒక గోల్ కొట్టారు. మలేషియా తరఫున ఏకైక గోల్ షెల్లో సిల్వెరియస్ సాధించాడు. ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 21వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 85 పతకం. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలున్నాయి. 21వ స్వర్ణంతో ఉజ్బెకిస్తాన్‌ను దాటిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఆసియా గేమ్స్‌లో భారత్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. భారత పురుషుల హాకీ జట్టుకు ఆసియా గేమ్స్‌లో ఇది ఐదో స్వర్ణం. గతంలో 1966, 1998, 2014, 2023లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టు వరుస ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించడం మాత్రం ఇదే తొలిసారి.
No comments:
Post a Comment