రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టి కేవలం ఫ్రస్టేషన్‌లో బూతు పురాణం మాట్లాడుతున్నాడు !

الخميس، 1 أكتوبر 2026

BRS Working President KTR he is no 'Nallamala tiger' but merely a cat belonging to Chandrababu Revanth Reddy has abandoned governance and is spouting profanities out of sheer frustration telangana

t f B! P L

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టి కేవలం ఫ్రస్టేషన్‌లో బూతు పురాణం మాట్లాడుతున్నారని, ఆయన నల్లమల పులి ఎంతమాత్రం కాదని, చంద్రబాబు వద్ద ఉండే పిల్లి మాత్రమేనని ఎద్దేవా చేశారు. "నాకు హోటల్ ఉందనే విషయాన్ని నేను 2009లోనే ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నాను. నేను స్వయంగా వెల్లడించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఏదో కొలంబస్ లేదా వాస్కోడిగామా కొత్తగా కనుక్కున్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం" అని అన్నారు. ఆయన ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ నాశనమవుతుందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా బొందపెట్టిన రేవంత్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దాన్ని కూడా ఎవరూ ఓటు వేయకుండా చేసే స్థాయికి దిగజార్చుతున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల పర్యటనకు వేలమంది పోలీసులతో వెళ్లడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. "ఒక ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్, ఆరుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు కలిసి ఏకంగా 4,000 మంది పోలీసుల బందోబస్తుతో సిరిసిల్లకు ఏదో దండయాత్రకు వెళ్లినట్లు వెళ్లారు. అంతమంది పోలీసులతో వెళ్లిన రేవంత్ రెడ్డి పులి ఎలా అవుతారు?" అని ప్రశ్నించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా ఆ ఫ్రస్టేషన్ ఏంటని నిలదీశారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నేతన్నలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షల బీమా వచ్చేలా 'నేతన్నకు బీమా' పథకాన్ని తెచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు బంద్ చేసి చేనేత కార్మికుల పొట్ట కొట్టారని, సభలో వీరి సమస్యల గురించి మాట్లాడుతారని అనుకుంటే సీఎం మళ్లీ పాత బూతు పురాణాన్నే చదివారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ