నవంబర్ 13న 'గీతాంజలి' తెలుగు, తమిళ భాషల్లో రీ-రిలీజ్

الخميس، 1 أكتوبر 2026

'Geethanjali' to Re-release in Telugu and Tamil on November 13 Andhra Pradesh cinema film left an indelible mark on audiences with its brilliant storytelling heart-touching emotions tamilnadu telangana

t f B! P L

ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్‌లో 'గీతాంజలి' గ్రాండ్‌గా నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో రీ-రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన కథనం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, గొప్ప సంగీతంతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, అందమైన అనుభూతులను ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించింది. ఇప్పటివరకు 'గీతాంజలి'ని ప్రేమించిన ప్రేక్షకులకు ఈ 4K రీ-రిలీజ్ మరోసారి ఆ మధురానుభూతిని థియేటర్‌లో అందించనుంది. పిక్చర్ క్వాలిటీ, విజువల్ డీటెయిలింగ్‌తో సినిమా మరింత గ్రాండ్‌గా కనిపించనుంది. అదే సమయంలో ఒరిజినల్ సినిమా అందించిన ఎమోషన్, చార్మ్‌ను ఎలాంటి మార్పు లేకుండా ప్రేక్షకులకు అందించనున్నారు. ఇళయరాజా అందించిన సంగీతం 'గీతాంజలి'కి ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన స్వరపరిచిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవర్ గ్రీన్. బూర్లె శివ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ పద్మిని సినిమాస్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రేమించిన అభిమానులతో పాటు, కొత్త తరం ప్రేక్షకులకు కూడా 'గీతాంజలి'ని బిగ్ స్క్రీన్‌పై ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ