నందిగ్రామ్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హాసీ రాణి రాత్ ఘన విజయం - LATEST NEWS AP TO TG

LATEST NEWS AP TO TG

One step One Vision

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, October 9, 2026

నందిగ్రామ్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హాసీ రాణి రాత్ ఘన విజయం

పశ్చిమ బెంగాల్‌లో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హాసీ రాణి రాత్ తన సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో హత్యకు గురైన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రాత్ తల్లి ఈమె. సువేందు అధికారి పేరిట ఉన్న గత రికార్డులను బద్దలు కొడుతూ ఆమె ఈ అఖండ విజయాన్ని సాధించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి భబానీపూర్, నందిగ్రామ్ రెండూ స్థానాల నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన భబానీపూర్ స్థానాన్ని ఉంచుకుని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. దాంతో దివంగత తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాత్ తల్లి హాసీ రాణి రాత్‌కు బీజేపీ తరఫున సువేందు అధికారి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ 41,674 ఓట్లు సాధించగా, హాసీ రాణి రాత్ అత్యధికంగా 1,64,427 ఓట్లు సాధించారు.అంటే తన ప్రత్యర్థి కంటే ఏకంగా 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. 1967 తర్వాత ఈ నియోజకవర్గంలో నమోదైన అత్యధిక విజయ ఓట్ల తేడా ఇదే కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు సువేందు అధికారి పేరు మీదే ఉండేది. ఆయన 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 81,230 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages