Friday, October 16, 2026

గొల్లపల్లి జలాశయంలో మునిగి ఐదుగురు మహిళలు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గొల్లపల్లి జలాశయంలో మునిగి ఐదుగురు మహిళలు మృతి చెందారు. వీరు బెంగళూరు నుంచి పెనుకొండ దర్గాపేటకు వచ్చి అక్కడి జలాశయంలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్లను రప్పించి వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు  ఐదుగురి  మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారిని  గాయత్రి, ఆమె కుమార్తె అశ్విని, స్నేహితులు పుష్ప, హసీనా, మహిన్ లుగా గుర్తించారు. పెనుకొండ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.