ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సక్రమంగా జరిగే వాతావరణం లేదని, అందుకు పుంగనూరు, రాయచోటిలో జరిగిన హింసాత్మక ఘటనా క్రమమే ప్రత్యక్ష నిదర్శనమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ, నామినేషన్ల సమయంలోనూ కూటమి ప్రభుత్వం దాడులకు దిగుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా తమ పార్టీ అభ్యర్థులను అంతం చేయాలని చూస్తున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఎన్నికల నుంచి పారిపోయే ప్రసక్తే లేదని, ప్రతి అడుగులోనూ ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికలను బహిష్కరించి పారిపోయిన చరిత్ర ఆయనదని, కానీ వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం అలా కాదని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. తమ వెనుక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నారని, అన్నింటికీ తెగించి మరీ తాము ఈ స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, కార్యకర్తలకు అండగా నిలబడి పోరాటం ఆపేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రాణాలకు తెగించిసైనా స్థానిక సమరంలో వైఎస్సార్సీపీ జెండా పాతడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలను పూర్తిగా పక్షపాత ధోరణితో, హింసాత్మక వాతావరణంలో నిర్వహిస్తున్నందున రాష్ట్ర పోలీసులపై నమ్మకం పోయిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు వెంటనే రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించి, అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తక్షణమే స్పందించాలని అమర్నాథ్ కోరారు. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న పరిణామాలను గవర్నర్ సుమోటోగా స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నివేదిక కోరాలని డిమాండ్ చేశారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతటి దాడులకు పాల్పడినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయబోవని, క్షేత్రస్థాయిలో కూటమి సర్కార్ అక్రమాలను ఎండగడుతూ పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ పదే పదే తాము ఎన్నికల నుంచి పారిపోబోమని చెప్పడం వెనుక .. పారిపోయేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Home
citing the recent violent incidents in Punganur and Rayachoti as clear evidence
Former Minister Gudivada Amarnath
No Conducive Environment for Fair Elections in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సక్రమంగా జరిగే వాతావరణం లేదు !
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

