Friday, October 16, 2026

తిరుమలలో వైభవంగా గరుడ సేవ : భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ

తిరుమలలో నవరాత్రి  బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవ జరగనుండటంతో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనుండటంతో స్వామివారి వాహనసేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే గ్యాలరీల్లోకి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. మరోవైపు తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు తడిసి ముద్దయ్యారు. అయినప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు గ్యాలరీల్లోనే వేచి చూస్తున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. స్వామివారి గరుడ వాహనసేవను కనులారా వీక్షించేందుకు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదు. శ్రీవారి దర్శనం, వాహనసేవ కోసం భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గరుడసేవ నేపథ్యంలో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.