Friday, October 16, 2026

విజయవాడ - తిరుపతి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు

దసరా సెలవులు, బ్రహ్మోత్సవాల వేళ తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. దీంతో, రద్దీకి అనుగుణంగా విజయవాడ నుంచి తిరుపతికి జన్​ సాధారణ్ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు తిరుపతి - విజయవాడ మార్గంలో ఈ నెల 17 నుంచి 20 వరకు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07251 తిరుపతి - విజయవాడ జన సాధారణ్ స్పెషల్ ఈ రైలు అక్టోబర్ 17న తిరుపతి నుంచి విజయవాడ వరకు ప్రయాణించనుంది. తిరుపతిలో తెల్లవారుజామున 2.30గంటలకు బయల్దేరి ఉదయం 9.30గంటలకు విజయవాడ చేరుతుంది. అదే విధంగా ట్రైన్ నంబర్ 07249 విజయవాడ - తిరుపతి జన సాధారణ్ స్పెషల్ రైలు అక్టోబర్ 17 నుంచి 20 వరకు విజయవాడ నుంచి తిరుపతి వరకు 4 ట్రిప్పులు కొనసాగుతుంది. విజయవాడలో ఉదయం 10గంటలకు బయల్దేరి రాత్రి 7గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ట్రైన్ నంబర్ 07250  రైలు అక్టోబర్ 17 నుంచి 19 వరకు తిరుపతి నుంచి విజయవాడ వరకు 3 ట్రిప్పులు కొనసాగుతుంది. తిరుపతిలో రాత్రి 9.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చిన గంజాం, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, దుగ్గిరాల, పెద్దవాడిపూడి స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.