ఏసీబీకి చిక్కిన పంచాయతీ కరోబార్ : ఇంటి మ్యుటేషన్‌కు లంచం డిమాండ్
Tuesday, October 6, 2026
Demanding Bribe for House Mutation Jakkapur village Narayanraopet Mandal Panchayat Official Caught by ACB Siddipet district telangana
తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ఇంటి మోటేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పంచాయతీ కరోబార్ పట్టుబడ్డాడు. జక్కాపూర్ గ్రామానికి చెందిన కయ్యాల కిషన్ రెడ్డి తన తండ్రి మరణించడంతో తన తండ్రి పేరు పై ఉన్న ఇల్లు ను తన పేరుపై మోటివేషన్ చేయడానికి గ్రామపంచాయతీ కరోబర్ మాట్ల సంతోష్ 15వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పథకం ప్రకారం వల పన్ని కరోబార్ సంతోష్ ను ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

No comments:
Post a Comment