తెలంగాణలో రెవెన్యూ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం - LATEST NEWS AP TO TG

LATEST NEWS AP TO TG

One step One Vision

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, October 9, 2026

తెలంగాణలో రెవెన్యూ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేస్తూ జీవో నంబర్- 630ను ప్రభుత్వం  విడుదల చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ను నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేసింది. ఎన్. ప్రసూనాంబ ను జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది. డి. వెంకట మాధవరావు ను నిర్మల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది. పి. రామ్‌రెడ్డిని వనపర్తి జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేసింది. ఎ. యాదగిరి మహబూబ్‌నగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ఏ)గా పోస్టింగ్ ఇచ్చింది. మోహన్ సింగ్ రాజన్న-సిరిసిల్ల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ఏ)గా నియమించింది. పి. పద్మప్రియ హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ కు డిప్యుటేషన్‌పై బదిలీ చేసింది. సీహెచ్. కృష్ణయ్య మేడ్చల్ - మల్కాజిగిరి ఎస్డీఎల్,యూఎల్సీ గా నియమించింది. జి. కుమారస్వామి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ఏ)గా ప్రభుత్వం బదిలీ చేసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages