News Breaking
Live
wb_sunny

Breaking News

జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులు : జేఎన్‌యూ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ విశ్వవిద్యాలయ సేవల నుంచి తొలగింపు

జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులు : జేఎన్‌యూ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ విశ్వవిద్యాలయ సేవల నుంచి తొలగింపు

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో  జేఎన్‌యూ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ డాక్టర్ అంగోంచా బిమోల్ అకోయిజామ్‌ను విశ్వవిద్యాలయ సేవల నుంచి తొలగించింది. జేఎన్‌యూ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వచ్చింది. ఆయనకు కఠినమైన శిక్ష విధించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం సామాజిక శాస్త్రం, సామాజిక వ్యవస్థల అధ్యయన కేంద్రానికి చెందిన ఫ్రొఫెసర్‌ అకోయిజామ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేగింది. ఈ ఆరోపణలపై అధికారులు అంతర్గత విచారణ జరిపారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఆయనను యూనివర్సిటీ సేవల నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. సదరు ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలతో విద్యార్థినులు విశ్వవిద్యాలయ అంతర్గత కమిటీకి రాతపూర్వక ఫిర్యాదులు చేశారు. తరగతి గదిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధికారిక సమావేశాలు, క్లాసులు జరిగే సమయంలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపించారు. మొదట ఓ విద్యార్థిని తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టడంతో ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment