కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో తన కుటుంబంతో కలిసి పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వని వారి ఓట్లను తొలగించి, నకిలీ ఓట్లను జాబితాలో చేర్చుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అవకతవకలకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యుడని పేర్కొన్నారు. ఆయన హయాంలోనే ఇదంతా బహిరంగంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీని నిరసిస్తూ సీజేపీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనుంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటన రాజకీయంగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనతో ఢిల్లీ వీధుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, మెట్రో స్టేషన్లను మూసివేయడం సహా పలు చర్యలు చేపట్టారు. అలాగే, ఢిల్లీ వీధుల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
Post Top Ad
Responsive Ads Here
Friday, October 9, 2026
Home
He emphasized that this agitation is not limited to any single individual
Kejriwal Announces Participation in CJP Protests with Family
national
New Delhi
సీజేపీ నిరసనల్లో కుటుంబంతో కలిసి పాల్గొనున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్
సీజేపీ నిరసనల్లో కుటుంబంతో కలిసి పాల్గొనున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్
Tags
# He emphasized that this agitation is not limited to any single individual
# Kejriwal Announces Participation in CJP Protests with Family
# national
# New Delhi
Share This
About Telugu Lo Computer
New Delhi
in
He emphasized that this agitation is not limited to any single individual,
Kejriwal Announces Participation in CJP Protests with Family,
national,
New Delhi
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment