ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద గన్ ఏఆర్‌ కానిస్టేబుల్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ : ఎడమవైపు ఛాతీ కింద భాగంలో తీవ్ర గాయం

Tuesday, October 6, 2026

Accidental Gun Discharge at INS Dega Andhra Pradesh AR Constable Sustains Severe Chest Injury security duty for Union Defence Minister Rajnath Singh's visit Visakhapatnam

t f B! P L

విశాఖపట్నంలో గన్ మిస్‌ఫైర్ ఘటన తీవ్ర కలకలం రేపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన భద్రతా విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ అయి తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్పలకొండ వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి గుండు దూసుకెళ్లడంతో ఆయన ఎడమవైపు ఛాతీ కింద భాగంలో తీవ్ర గాయమైంది. తుపాకీ పేలిన పెద్ద శబ్దం విన్న వెంటనే అక్కడే ఉన్న ఇతర భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న అప్పలకొండను గమనించి, వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ