విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులకు పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

السبت، 3 أكتوبر 2026

CM Revanth Reddy issues key directives CMO officials Collectors to visit schools and hospitals telangana to officials regarding ground-level conditions in the education and healthcare sectors

t f B! P L

తెలంగాణ సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ప్రధాన హాస్పిటల్స్ నిర్మాణాలు, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా హాస్పిటల్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని, హాస్పిటల్స్ నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. అవసరమైన అత్యాధునిక పరికారాలను కొనుగోలు చేసి, ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యేనాటికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతోపాటు అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, హాస్పిటల్స్‌ను సందర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతీ వారం వీటిపై సమీక్ష నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైనచోట మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపైనా సమావేశంలో అధికారులతో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ