పనిమనిషి దొంగతనం చేసిందన్న అనుమానంతో కుర్చీకి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి : సోషల్ మీడియాలో వీడియో వైరల్

السبت، 3 أكتوبر 2026

Maid tied to chair and brutally beaten with sticks over theft suspicion Nexara Colony of Hardoi district Uttar Pradesh Video goes viral on social media

t f B! P L

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లా నెక్సరా కాలనీలో ఇంట్లో దొంగతనం జరిగిందన్న అనుమానంతో ఓ మహిళ పనిమనిషిని కుర్చీకి కట్టేసి, కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాసన అనే మహిళ ఇంటి పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిందని యజమానురాలు ఆకాంక్ష, ఆమె కుటుంబ సభ్యులు ఉపాసనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను బలవంతంగా కుర్చీకి కట్టేసి దారుణంగా కొట్టారు. చేతులతో, చెప్పులతో విరుచుకుపడటమే కాకుండా కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో ఓ మహిళ ఏకంగా కర్రతో బాధితురాలి గొంతుపై నొక్కిపెట్టి చిత్రహింసలకు గురి చేసింది. దొంగతనం తానే చేశానని ఒప్పుకోవాలంటూ వారు తీవ్రంగా హింసించారని బాధితురాలు కన్నీరుమున్నీరు అయింది. దాడి అనంతరం బాధితురాలు ఉపాసన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి వీడియోలను చూసిన పోలీసులు వెంటనే స్పందించి, ఆకాంక్షతో పాటు మరో ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ