పోలీసు వాహనాన్ని, కారును ఢీకొట్టిన ఇసుక లారీ : సీఆర్పీఎఫ్ జవాన్ మృతి - LATEST NEWS AP TO TG

LATEST NEWS AP TO TG

One step One Vision

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, October 8, 2026

పోలీసు వాహనాన్ని, కారును ఢీకొట్టిన ఇసుక లారీ : సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

తెలంగాణలోని ములుగు జిల్లా గోవిందరావుపేట్, తాడ్వాయి మండలాల మధ్య అటవీ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ పోలీసు వాహనాన్ని, ప్రైవేట్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలిసిన వివరాల ప్రకారం ఏటూరునాగారం మండల కేంద్రం నుంచి ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసు వాహనంలో ములుగు వైపు వస్తున్నారు. అదే సమయంలో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ గోవిందరావుపేట్, తాడ్వాయి మండలాల మధ్య అటవీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న పోలీసు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ కారును కూడా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ కారు ఇసుక లారీ కిందకు దూసుకుపోగా, పోలీసు వాహనం అదుపుతప్పి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మొగునూరి రమాకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో జవాన్లు గిరీష్ కుమార్, ప్రేమ్ ప్రకాష్, రంజాన్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సఫియాకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు. ఈ ఘటనపై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages