ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన జోరుగా సాగుతోంది. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా కీలక భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రూ.30 వేల కోట్ల అంచనాతో చేపడుతున్న జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార పనులకు సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను అభ్యర్థించారు. భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పురోగతిని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులను సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న నెపంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన 'స్టాప్ వర్క్ ఆర్డర్' ప్రస్తుతం నిలిపివేతలో ఉందని, దాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ త్వరగా పూర్తయ్యేలా కేంద్రమే చొరవ చూపాలని, అందుకు కేంద్ర జలశక్తి శాఖ సమక్షంలో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూసేకరణ, పునరావాస పనులకు సమాన ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 41.15 మీటర్ల వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన ఆర్ అండ్ ఆర్ పనులను వేగవంతం చేశామని, అలాగే 45.72 మీటర్ల కాంటూరు స్థాయికి నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. పోలవరం పనులకు ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని కోరారు. అలాగే సముద్రంలో వృధాగా కలిసిపోయే వేల టీఎంసీల గోదావరి వరద నీటిని పట్టిసీమ ద్వారా మళ్లించి సద్వినియోగం చేస్తున్నామని, పోలవరం పరిసరాలను అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇటీవల ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార పనులను ప్రారంభించినట్లు సీఎం వివరించారు. ఏపీలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉండగా, మిగిలిన 27 లక్షల కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చేలా కొత్తగా శంకుస్థాపన చేసిన పనులకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక చొరవ చూపాలని అభ్యర్థించారు. నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, పరస్పర సహకారంతో దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యలను పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.
Post Top Ad
Responsive Ads Here
Thursday, October 8, 2026
Home
Andhra Pradesh
CM Chandrababu Holds Separate Meetings with Union Minister C.R. Patil
Home Minister Amit Shah
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, హోం మంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, హోం మంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు భేటీ
Tags
# Andhra Pradesh
# CM Chandrababu Holds Separate Meetings with Union Minister C.R. Patil
# Home Minister Amit Shah
Share This
About Telugu Lo Computer
Home Minister Amit Shah
in
Andhra Pradesh,
CM Chandrababu Holds Separate Meetings with Union Minister C.R. Patil,
Home Minister Amit Shah
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment