ఆసియా గేమ్స్ లో భారత పురుషుల క్రికెట్ టీమ్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. శ్రీలంక కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో తారిండు రత్నాయకే, సహాన్ అరాచ్‌చిగే రెండేసి వికెట్లు తీయగా.. వానుజా సాహన్, లసిత్ క్రూస్పుల్లే, నువానిడు ఫెర్నాండో తలో వికెట్ తీసారు. అనంతరం శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా(2/7),అక్షర్ పటేల్(2/8), అభిషేక్ శర్మ(2/2) రెండేసి వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. ఫైనల్ చేరిన భారత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
ఆసియా గేమ్స్ : శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరిన భారత్
Thursday, October 1, 2026
Asian Games India is set to face arch-rivals Pakistan in the final on Saturday India storms into the final with a massive victory over Sri Lanka national sports
No comments:
Post a Comment