News Breaking
Live
wb_sunny

Breaking News

రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం

హైదరాబాద్ లోని మలక్‌పేట్ డీ-మార్ట్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందింది. ఆటో డ్రైవర్ నిర్లక్షంతో బైక్ అదుపుతప్పి బస్సు కిందపడి ఎల్బీనగర్‌కు చెందిన వివాహిత లావణ్య (25) అక్కడికక్కడే మృతిచెందింది. వివరాల్లోకి వెళితే ఎల్‌బీనగర్‌కు చెందిన బి. లావణ్య (25) భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎల్‌బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తుంది, డీ-మార్ట్ సిగ్నల్ వద్ద ఆటో డ్రైవర్‌ నిర్లక్షంతో రోడ్డును దాట బోయాడు. దీంతో కంగారుపడిన లావణ్య అదుపుతప్పి పడిపోయింది. అయితే అదే సమయంలో దురదృష్టవశాత్తు బస్సు వచ్చింది. దీంతో బస్సు వెనుక చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment