News Breaking
Live
wb_sunny

Breaking News

కుషాక్ కార్ల ధరలను పెంచిన స్కోడా ఆటో ఇండియా

కుషాక్ కార్ల ధరలను పెంచిన స్కోడా ఆటో ఇండియా

స్కోడా ఆటో ఇండియా కుషాక్ ధరలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలైన తర్వాత ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి ధర పెంపు ఇదే మొదటిసారి. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉన్న ఈ కారు ధర ఇప్పుడు రూ. 20,000 వరకు పెరిగింది. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లోని.. ప్రెస్టీజ్ 1.0 ఏటీ, మాంటే కార్లో 1.0 ఏటీ, ప్రెస్టీజ్ 1.5 డీసీటీ, మాంటే కార్లో 1.5 డీసీటీ వేరియంట్ల ధరలు ఒక్కొక్కదానికి రూ. 20,000 చొప్పున పెరిగాయి. అదే విధంగా.. ప్రెస్టీజ్ 1.0 ఎంటీ, స్పోర్ట్‌లైన్ 1.0 ఏటీ, స్పోర్ట్‌లైన్ 1.0 ఎంటీ, క్లాసిక్ ప్లస్ 1.0 ఏటీ వేరియంట్ల ధరలు ఒక్కొక్కదానికి రూ. 15,000 చొప్పున పెరిగాయి. 2026 కుషాక్ సిగ్నేచర్ 1.0 ఏటీ, సిగ్నేచర్ 1.0 ఏంటీ వేరియంట్ల ధరలు రూ.10వేలు పెరిగాయి. అయితే క్లాసిక్+ 1.0 ఏంటీ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment