News Breaking
Live
wb_sunny

Breaking News

అమెరికా - లెబనాన్‌ దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేసిన డొనాల్డ్ ట్రంప్ : స్వాగతించిన లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవూన్

అమెరికా - లెబనాన్‌ దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేసిన డొనాల్డ్ ట్రంప్ : స్వాగతించిన లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవూన్

1985 నుంచి నిలిచిపోయిన అమెరికా - లెబనాన్‌ దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులపై ఉన్న 40 ఏళ్ల నాటి నిషేధాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఎత్తివేశారు. ఈ నిర్ణయాన్ని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవూన్ స్వాగతించారు. సివిల్ ఏవియేషన్ భద్రత విషయంలో లెబనాన్ చేపట్టిన చర్యలపై అమెరికాకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు. 1985లో 'TWA ఫ్లైట్ 847' విమానం హైజాక్ కు గురైన తర్వాత నాటి రోనాల్డ్ రీగన్ ప్రభుత్వం ఈ ప్రత్యక్ష విమాన సర్వీసులపై నిషేధం విధించింది. ఇటీవల జులైలో లెబనాన్ అధ్యక్షుడు అవూన్ వాషింగ్టన్‌లో పర్యటించిన సమయంలో అమెరికా విమానయాన సంస్థలు మళ్లీ నేరుగా విమానాలను నడిపేందుకు అనుమతిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధాల్లో ఇరాన్ మద్ధతు ఉన్న హిజ్బుల్లా బలహీనపడటం, దాని ముఖ్య నేతలు హతమవ్వడం వంటి పరిణామాల మధ్య ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment