.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} అమెరికా ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసల : తదుపరి విచారణలో శిక్ష ఖరారు-LATEST NEWS AP TO TG అమెరికా ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసల : తదుపరి విచారణలో శిక్ష ఖరారు-LATEST NEWS AP TO TG
W T F

అమెరికా ఫ్రాడ్ కేసులో నేరం అంగీకరించిన నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసల : తదుపరి విచారణలో శిక్ష ఖరారు

Wednesday, October 7, 2026

Andhra Pradesh Former NATA President Dr. Raghavareddy Gosala Pleads Guilty in US Fraud Case national Sentencing to be Determined at Future Hearing telangana

t f B! P L

అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియాలో భారీ ఫ్రాడ్ కేసు కలకలం రేపింది. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసల నేరం అంగీకరించారు. ఛార్టిబుల్ మ్యాచింగ్ ప్రోగ్రామ్‌లను మోసగించడం, ట్యాక్స్ రిటర్న్‌లను తప్పుగా చూపించడం లాంటి వ్యవహారాల్లో ఆయన ఫెడరల్ కోర్టులో తప్పు ఒప్పుకున్నారు. వైర్ ఫ్రాడ్, అమెరికా ప్రభుత్వాన్ని మోసగించే కుట్ర చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. లాభాపేక్ష లేని సంస్థను అడ్డం పెట్టుకుని ఆయన ఈ మోసానికి పాల్పడ్డారు. నాటా సంస్థ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యజమానుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్ల ఫ్రాడ్ విరాళాలను ఆయన సేకరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెన్సిల్వేనియాలోని నార్త్ వేల్స్‌కు చెందిన 65 ఏళ్ల రాఘవరెడ్డి గోసల పై 2026 మే 5న కేసు నమోదు అయింది. ఫెడరల్ కోర్టులో విచారణ జరగ్గా తనపై మోపిన అభియోగాలన్నింటినీ ప్లీ అగ్రిమెంట్ కింద ఆయన అంగీకరించారు. ఈ కేసును అసిస్టెంట్ యూఎస్ అటార్నీ మైఖేల్ జి. పిట్‌మాన్, సాహిబ్ కౌర్ సహాయంతో వాదిస్తున్నారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఎఫ్‌బీఐ దర్యాప్తు సంస్థల విచారణ తర్వాత రాఘవరెడ్డి గోసల వ్యవహారం బయటపడింది. నేరం అంగీకరించడంతో ఈ కేసు తదుపరి విచారణలో కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ