.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్ -LATEST NEWS AP TO TG కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్ -LATEST NEWS AP TO TG
W T F

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్

Tuesday, October 6, 2026

emotional Instagram post Harmanpreet Kaur Steps Down as Captain I will continue as a regular player in the squad national sports

t f B! P L

భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి మూడు ఫార్మాట్లలో కేవలం ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేసింది. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టు సారథిగా కొనసాగిన హర్మన్‌ప్రీత్ కౌర్ చిర్మసరణీయమైన విజయాలను అందించింది. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలు 2026లో భారత జట్టుకు వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ విజయం సాధించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకుంది. 'కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం అంత ఈజీ కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, జట్టు ఎదుగుదల కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఉన్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకున్న ఈ క్షణాన నా హృదయం భావోద్వేగాలతో నిండి ఉంది. కానీ అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా జట్టు ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉందని నేను విశ్వసిస్తున్నా. ఇక నుంచి జట్టులో ఒక సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతాను. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచర ప్లేయర్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి, బీసీసీఐకి, నా కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు''అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ