ఎస్‌ఐఆర్‌తో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా కలకలం రేపుతుండగానే సుమారు రెండు దశాబ్దాల క్రితం (2006లో) ఆయనపై నమోదైన ఓ ఆత్మహత్య కేసుకు సంబంధించి కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నాటి కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలా విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 2006లో కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్టులో భాగంగా ఎంసీ రోడ్డు ఆధునీకరణ పనుల కాంట్రాక్ట్‌ను మలేషియాకు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ 'పాటి', కేరళకు చెందిన భాగీరథి కన్ స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంయుక్తంగా 'పాటి-బెల్' పేరుతో చేపట్టాయి. కేరళ కేఎస్‌పీటీ-1 ప్రాజెక్ట్‌కు చీఫ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మలేషియాకు చెందిన సివిల్ ఇంజనీర్ లీసీ బీన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా జ్ఞానేశ్ కుమార్ ఉన్నారు. ఆత్మహత్యకు ముందు లీసీ బీన్ రాసిన సూసైడ్ నోట్‌లో జ్ఞానేశ్ కుమార్ పేరును ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు పనుల నిర్వహణలో తీవ్రమైన అవినీతి, తప్పుడు నిర్వహణ జరిగిందని, అలాగే పీడబ్ల్యూడీ అధికారుల నుండి తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల వెనుక అప్పటి పీడబ్ల్యూడీ సెక్రటరీగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణ. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిగినప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోలేదని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ కేసు దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి రాలేదనే బలమైన అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో, ఆ నాటి సూసైడ్ నోట్‌లోని ఆరోపణలు, మరియు ప్రాథమిక దర్యాప్తులో జరిగిన లోపాలు, ఒత్తిళ్లపై సమగ్రమైన విజిలెన్స్ విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకొస్తాయని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు కేరళ హోం మంత్రి ఆదేశాలు జారీ
Sunday, October 4, 2026
Kerala Home Minister Orders Vigilance Probe Against Gyanesh Kumar national suicide case involving him that dates back nearly two decades
No comments:
Post a Comment