Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

తిరుమల బ్రహ్మోత్సవాల వేళ చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం కు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంది. సెలవులు పూర్తయ్యే వరకూ ప్రయాణీకుల రద్దీకి అనుగుణం గా నిర్ణయాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. చర్లపల్లి-తిరుపతి మధ్య ఆది, సోమవారాల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 07713 ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 6.10గంటలకు, 07714 ప్రత్యేక రైలు తిరుపతి నుంచి సోమవారం మధ్యాహ్నం 2.45గంటలకు బయల్దేరుతాయని తెలిపారు. ఈ రైలు జనగాం, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.  

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement