ホーム
/
Trust Board Member Srilatha pledges a donation of ₹1 lakh every two months for the duration of her term
/
సింహాచలం అన్నదానానికి పదవీ కాలమంతా ప్రతి రెండు నెలలకు రూ.లక్ష చొప్పున విరాళాన్ని ప్రకటించిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీలత
Friday, October 2, 2026
Andhra Pradesh Simhachalam free meal initiative Trust Board Member Srilatha pledges a donation of ₹1 lakh every two months for the duration of her term
శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రమైన సింహాచలంలో నిత్యం వేలాది మంది భక్తులకు ప్రసాదించబడుతున్న "శ్రీ సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద మహాయజ్ఞం"కు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి గుత్తికొండ శ్రీలత విరాళాన్ని ప్రకటించారు. "ఆకలితో వచ్చిన భక్తునికి అన్నం పెట్టడం అంటే స్వయంగా శ్రీ సింహాద్రి అప్పన్న స్వామివారికే నైవేద్య సేవ చేసినట్లే" అనే ఉన్నత భావంతో, తన ట్రస్ట్ బోర్డు సభ్యురాలి గా పదవీ కాలమంతా ప్రతి రెండు నెలలకు రూ.1,00,000 చొప్పున స్వామివారి సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి విరాళంగా సమర్పించాలని పవిత్ర సంకల్పం చేశారు. ఆ మహోన్నత సంకల్పానికి, రెండు నెలలకు సంబంధించిన రూ.1,50,000 చెక్కును దేవస్థానం రెండవ విడతగా కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావుకి భక్తిశ్రద్ధలతో అందజేశారు. శ్రీలత సేవాస్ఫూర్తిని, స్వామివారి పట్ల ఆమెకున్న అపార భక్తిని అభినందించారు.
No comments:
Post a Comment