షావోమీ 17టీ ధరను భారీగా పెంచిన షావోమీ కంపెనీ

Friday, October 2, 2026

6500mAh battery with 67W HyperCharge support business Launched in June of this year technology Xiaomi Significantly Hikes Price of Xiaomi 17T

t f B! P L

షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 17టీ ధరను భారీగా పెంచింది. ఈ ఏడాది జూన్‌లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ షావోమీ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్, 67W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీ ఉన్నాయి. షావోమీ 17టీలో 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.69,999 కాగా, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999గా ఉంది. లాంచ్ సమయంలో 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999 కాగా, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999గా ఉండేది. లాంచ్ ధరతో పోలిస్తే.. ఈ 2 వేరియంట్ల ధరలు రూ.10వేలు పెరిగాయి. అయితే, లాంచ్ సమయంలో కంపెనీ రూ.5వేలు తగ్గింపుతో లభిస్తుంది. షావోమీ 17టీలో 2756×1268 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 3 ఉంటుంది. ఇందులో 6500mAh బ్యాటరీ ఉంది. 67W హైపర్‌ఛార్జ్ 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP 5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/3.0 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, NFC, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ