సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ నేతలు సంయుక్తంగా సమావేశం : 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపు

Sunday, October 4, 2026

and TJS Leaders at CPM State Office Call for Protests at Collectorates on the 6th demand raised during the meeting was the immediate removal of EC Joint Meeting of Congress Left Parties telangana

t f B! P L

హైదరాబాద్ లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ నేతలు సంయుక్తంగా సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఎన్నికల సంఘం పనితీరుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఈ సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఈ సంయుక్త సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మల్లు రవి, సీపీఎం తరఫున జాన్ వెస్లీ, సీపీఐ తరఫున నరసింహ, సీపీఐ (ఎంఎల్) తరఫున గోవర్ధన్, తదితరులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ ను తొలగించాలనే డిమాండ్‌ను మరింత ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించనున్నట్లుగా నేతలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ఇదే ప్రధాన డిమాండ్‌తో ఇప్పటికే నవంబర్ 1వ తేదీన 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ