ホーム
/
several injured
/
ఉక్రెయిన్‌లో కుసుమ్ గ్రూప్ ఫార్మా కంపెనీపై డ్రోన్ దాడి : ఒకరు మృతి, పలువురికి గాయాలు
Sunday, October 4, 2026
Drone Attack on Kusum Group Pharma Company in Ukraine international One dead property damage worth approximately ₹400 crore several injured
ఉక్రెయిన్‌లోని భారత ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన తయారీ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి కారణంగా ఫార్మా ప్లాంట్ ప్రధాన భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. డ్రోన్ దాడి అనంతరం ప్లాంట్ నుంచి దట్టమైన పొగలు వెలువడినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు రూ.400 కోట్ల విలువైన ఆస్తులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. మృతుడి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. భారత ఫార్మా సంస్థ కుసుమ్ గ్రూప్ 1994లో భారత్ నుంచి ఉక్రెయిన్‌కు మందులను ఎగుమతి చేయడం ద్వారా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థను రాజీవ్ గుప్తా నిర్వహిస్తున్నారు. 2002లో సంస్థ స్వతంత్రంగా జనరిక్ మందుల తయారీపై దృష్టి సారించింది. 2007లో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన కుసుమ్ గ్రూప్.. 2009లో ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో మరో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భారత్‌లో మరో రెండు తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. కుసుమ్ గ్రూప్ ప్రస్తుతం 50కి పైగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిలో ఎక్కువగా జనరిక్ మందులే ఉన్నాయి. సంస్థ ఉత్పత్తులు 9కి పైగా దేశాల్లో విక్రయమవుతున్నాయి. ఉక్రెయిన్‌తో పాటు ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఫిలిప్పీన్స్ సంస్థకు కీలక మార్కెట్లుగా ఉన్నాయి. డ్రోన్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడి గుర్తింపు, గాయపడిన వారి పరిస్థితి, నష్టం తీవ్రతపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment