సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతున్న సుప్రీంకోర్టు

Sunday, October 4, 2026

national Supreme Court Prepares to Hear Petitions Against CEC Gyanesh Kumar's Decisions The Indian Express had published evidence

t f B! P L

సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సిద్దమవుతోంది. ఎస్ఐఆర్ విషయంలో గత 10 నెలల కాలంలో 14 నిర్ణయాల్ని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నారంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆధారాలు బయటపెట్టింది. అదేం లేదంటూ ఈసీ వివరణలు ఇచ్చింది. అయినా దీనిపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా సీఈసీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆయన రాజీనామా చేయాల్సిందేనంటూ ముంబైలో ఇప్పటికే భారీ ఆందోళన చేపట్టింది. అలాగే ఢిల్లీలోనూ జంతర్ మంతర్ వద్ద విపక్షాలు, కమ్యూనిస్టు విద్యార్ధి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అదే సమయంలో సీఈసీ జ్ఞానేష్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సిద్దమైంది. ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా తీసుకున్నట్లుగా చెబుతున్న వివాదాస్పద ఎస్ఐఆర్ నిర్ణయాలకు సంబంధించి, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఈ పిటిషన్లను విచారించబోతున్న ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్ తో పాటు జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన కూడా ఉన్నారు. పిటిషనర్లు 14 ఎస్ఐఆర్ నిర్ణయాలను రద్దు చేయాలని, జ్ఞానేష్ కుమార్‌పై విచారణ జరపాలని, ఎస్ఐఆర్ తొలగింపులపై సిట్ విచారణ జరపాలని కోరుతున్నారు. దీంతో సుప్రీంకోర్టు జరిపే విచారణ, ఇవ్వబోయే ఆదేశాల కోసం ఇప్పుడు దేశంలో చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇందులో జ్ఞానేష్ తప్పుచేసినట్లు తేలితే మాత్రం విపక్షాల ఆందోళనలు మరింత తీవ్రతరం కావడంతో పాటు సీఈసీ రాజీనామా చేయక తప్పని పరిస్ధితులు ఎదురుకావచ్చు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ