తమిళనాడుకు ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తో కలిసి చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 సేవలను లాంఛనంగా ప్రారంభించారు. చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రధాని మోడీకి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నాయకులు పోరూర్ బైపాస్ మెట్రో స్టేషన్‌కు చేరుకుని ఫేజ్-2 తొలి రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. చెన్నై మెట్రో ఫేజ్-2 కారిడార్-4 పరిధిలోని పూందమల్లి నుంచి పోరూర్ బైపాస్ మధ్య రూపుదిద్దుకున్న ఈ నూతన మార్గంలో ప్రధాని మోడీ, సీఎం విజయ్ కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. రైలు ప్రయాణ సమయంలో మెట్రో ప్రాజెక్టు విశేషాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు వారికి వివరించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో కలిసి ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో, రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫేజ్-2 ప్రాజెక్టు ప్రారంభంతో చెన్నై పశ్చిమ ఉపనగరాల నుంచి నగర కేంద్రానికి రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా కష్టాలు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే ఈ మార్గంలో డ్రైవర్ రహిత నౌకాయాన సాంకేతికతకు అనుగుణంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మెట్రో రైలులో ప్రయాణిస్తూ ప్రధాని మోడీ, సీఎం విజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణించడం స్థానికంగా ఉత్సాహాన్ని నింపింది. మెట్రో ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్ వేదికగా మరికొన్ని రోడ్డు, రైల్వే మరియు షిప్పింగ్ రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Travel the world
Climb the mountains
and shipping sectors at an event held at IIT MadrasCM Vijay Formally Inaugurate Chennai Metro Rail Phase-2 Servicesdevelopment projects related to the roadPrime Minister Narendra Modirailwaytamilnadu
సీఎం విజయ్ తో కలిసి చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 సేవలను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment