ఫెడరేషన్‌కు చెందిన 24 క్రాఫ్ట్‌ల నాయకులు సమావేశం ఏర్పాటు :డాన్సర్స్ అసోసియేషన్కు ఆహ్వానం ఇవ్వలేదని సుమలత ఆగ్రహం

الجمعة، 2 أكتوبر 2026

Andhra Pradesh cinema Leaders of the Federation's 24 crafts organized a meeting Sumalatha angry that the Dancers' Association was not invited telangana

t f B! P L

ఫిలిం నగర్‌లోని ఫిలిం చాంబర్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశానికి డాన్సర్స్ అసోసియేషన్‌ను పిలవకపోవడంపై ఆ సంఘం అధ్యక్షురాలు సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మద్దతుదారులు, తెలంగాణ, ఓయూ విద్యార్థి నాయకులతో కలిసి సమావేశం జరుగుతున్న హాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫెడరేషన్‌కు చెందిన 24 క్రాఫ్ట్‌ల నాయకులు సమావేశం ఏర్పాటు చేయగా, డాన్సర్స్ అసోసియేషన్‌ను మాత్రం పిలవలేదు. మిగతా క్రాఫ్ట్‌లన్నింటినీ పిలిచి తమ సంఘాన్ని ఎందుకు పక్కన పెట్టారని సుమలత ప్రశ్నించారు. ఈ క్రమంలో దాదాపు అరగంట పాటు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తన భర్త, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను ఫెడరేషన్ నాయకులు కావాలనే టార్గెట్ చేస్తున్నారని సుమలత ఆరోపించారు. మధ్యవర్తులు, ఏజెంట్లు లేకుండా డాన్సర్స్ అసోసియేషన్‌కు నేరుగా నిధులు అందేలా తాను చేస్తున్న ప్రయత్నాలు కొందరికి నచ్చలేదన్నారు. జానీ మాస్టర్‌పై విధించిన సస్పెన్షన్, నాన్ కో-ఆపరేషన్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదాల నేపథ్యంలో సుమలత నేతృత్వంలోని కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. అక్టోబర్ 18న కొత్త ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఫెడరేషన్ నిర్ణయాలను చట్టపరంగా ఎదుర్కొంటామని సుమలత వర్గం చెబుతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైన తనను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయని, ఫిలిం ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్‌లోనూ అవకతవకలు ఉన్నాయని డాన్సర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌పై చర్యలు తీసుకోవాలని సుమలత డిమాండ్ చేశారు. చిత్రపురి వ్యవహారంలో ఆయనపై రూ.110 కోట్ల మేర ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వివాదంపై రెండు మూడు రోజుల్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు సమాచారం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ