అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఒప్పో కొత్త ఆపరేటింగ్ సిస్టం color OS 17 - LATEST NEWS AP TO TG

LATEST NEWS AP TO TG

One step One Vision

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, October 9, 2026

అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఒప్పో కొత్త ఆపరేటింగ్ సిస్టం color OS 17

దేశంలో ఒప్పో కొత్త ఆపరేటింగ్ సిస్టం color OS 17 ను  Find X10 సిరీస్ ద్వారా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 15 సీరీస్ కు చెందిన ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ లలో కూడా colour OS 17 బీటా ప్రోగ్రాం మొదలైంది. దీంతో కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లను ముందుగానే పరీక్షించే అవకాశం యూజర్లకు దక్కుతుంది. ఒప్పో తన కొత్త సాఫ్ట్వేర్ కలర్ ఓఎస్ 17 ను అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాబోతోంది ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందింది. కొత్త డిజైన్.. మెరుగైన యానిమేషన్లు.. వేగవంతమైన స్క్రీన్ ట్రాన్సిషన్.. ఏఐ ఆధారిత ఫీచర్లపై కంపెనీ ప్రముఖంగా దృస్తారించినట్టు తెలుస్తోంది. దేశంలో colour OS 17 తొలిసారిగా అందుబాటులోకి రాబోతున్న స్మార్ట్ ఫోన్ లైన్ ఆఫ్ గా oppo find X10 సిరీస్ నిలవబోతోంది. ఈ సిరీస్లో find X10, find X10 pro max మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. Colour OS 17 లో living flow design పేరుతో కొత్త డిజైన్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఫోన్లో వివిధ స్క్రీన్ల మధ్య మారుతున్నప్పుడు, యాప్స్ తెరిచేటప్పుడు, నోటిఫికేషన్లు పరిశీలిస్తున్నప్పుడు యానిమేషన్లు మరింత స్మూత్ గా ఉండే విధంగా మార్చారు. Luminous effect ద్వారా స్క్రీన్ మీద కొన్ని కంట్రోల్స్ టచ్ చేసినప్పుడు కాంతి ప్రభావాలను చూపిస్తారు. ముఖ్యంగా క్విక్ సెట్టింగ్స్ లోని టేబుల్స్ ఉపయోగించినప్పుడు కొత్త విజువల్ ఎఫెక్ట్లు కనిపిస్తాయి. AI suggest ఫీచర్ ను కూడా మెరుగు చేస్తున్నారు. యూజర్ల అవసరాల తగ్గట్టుగా విడ్జెట్ లను సూచించడం. రోజువారి వినియోగాన్ని సులభతరం చేయడం దీని లక్షణంగా ఉన్నట్టు తెలుస్తోంది.. Laminar flow engine ద్వారా ఫోన్ వేగం.. పనితీరు.. యానిమేషన్ల సాఫీదనాన్ని మెరుగుపరిచే దానిపైన దృష్టిపెట్టారు. మరోవైపు వన్ ప్లస్ వినియోగదారులకు కూడా కొత్త సాఫ్ట్వేర్ను పరీక్షించే అవకాశం లభిస్తుంది. మనదేశంలో వన్ ప్లస్ 15, 15 ఆర్ 13 , 13ఎస్, 13 ఆర్ మోడల్ లకు కలర్ ఓఎస్ 17 ఓపెన్ బీటా ప్రోగ్రాం అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ 15 యూజర్ల కోసం అక్టోబర్ 9 నుంచి 12 వరకు దరఖాస్తు గడువు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇతర మోడల్స్ కు సంబంధించిన అర్హతలు.. సాఫ్ట్వేర్ వెర్షన్లు, అప్లికేషన్ నిబంధనలు ఆయా ఫోన్ల అధికారిక కమ్యూనిటీ ప్రకటనలలో గమనించడం మంచిది. ఓపెన్ బీటా వెర్షన్ లో కొత్త ఫీచర్లు ముందుగానే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యాప్స్ సరిగా పనిచేయకపోవడం.. బ్యాటరీ వినియోగంలో మార్పులు రావడం.. సిస్టం స్థిరత్వంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages