పాస్‌పోర్ట్ లేకపోవడం వల్లనే భారతదేశానికి రాలేకపోతున్నాను : కేఏ పాల్ సెల్ఫీ వీడియో విడుదల

الأربعاء، 30 سبتمبر 2026

​​Andhra Pradesh D.C I cannot return to India because I lack a passport KA Paul releases selfie video Mahatma Gandhi statue at the Indian Embassy in Washington telangana

t f B! P L

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  నిలబడి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన పాస్‌పోర్ట్ గడువు ముగియడంతో దాని రెన్యూవల్ కోసం భారత ఎంబసీలో దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా అధికారులు ఇంతవరకు కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయలేదని, పాస్‌పోర్ట్ లేకపోవడం వల్లనే తాను భారతదేశానికి రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌లను ఉద్దేశించి నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ కాకుండా అడ్డుకోవాలని ప్రధాని మోడీ, అమిత్ షాలే ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అని కేఏ పాల్ వీడియోలో సూటిగా ప్రశ్నించారు. తాను భారతదేశానికి వస్తే సమస్యలు వస్తాయనే కారణంతోనో, లేక తన స్వచ్ఛంద సంస్థల ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల అంశం వల్లో అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల సమయంలో విజయనగరంలో తనపై నమోదైన ఒక చిన్న ఎఫ్ఐఆర్ కారణాన్ని బూచిగా చూపి పాస్‌పోర్ట్ ఆపుతున్నారా అని ప్రశ్నించారు. తాను న్యాయపరంగా పోరాటం ప్రారంభించకముందే పాస్‌పోర్ట్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తాను నోరు విప్పితే ఢిల్లీ పెద్దలకు ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ