కేరళ లో కిటెక్స్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి నారా లోకేష్

الأربعاء، 30 سبتمبر 2026

Andhra Pradesh business Minister Nara Lokesh Visits Kitex Factory in Kerala textile and apparel sectors and expressed readiness

t f B! P L

కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సబు ఎం. జాకబ్‌ను కొచ్చిలో కలిశారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్, దుస్తుల తయారీ రంగం, పారిశ్రామిక అవకాశాలు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెక్స్‌టైల్, గార్మెంట్స్ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఏపీకి ఉందని ఆయన కిటెక్స్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలను పరిశీలించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని కిటెక్స్ సంస్థను మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్, అపెరల్ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పెట్టుబడులు పెట్టే సంస్థలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్, ఎండీ సబు ఎం. జాకబ్ ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ కొచ్చిలోని కిటెక్స్ ఫ్యాక్టరీని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వహిస్తున్న తయారీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గార్మెంట్స్ తయారీ ప్రక్రియ, ఉత్పత్తి విధానం, సమగ్ర తయారీ వ్యవస్థ వంటి అంశాలను మంత్రి పరిశీలించారు. భారతదేశంలోని ప్రముఖ దుస్తుల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉన్న కిటెక్స్.. ముడి పదార్థాల నుంచి తుది ఉత్పత్తి వరకు వివిధ దశలను సమన్వయం చేసే ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తోంది. ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా ఈ సమగ్ర తయారీ విధానం, పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియలను మంత్రి లోకేష్ పరిశీలించారు. టెక్స్‌టైల్, అపెరల్ రంగం ద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉండటంతో.. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా మహిళలకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే గార్మెంట్స్ పరిశ్రమను రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. కిటెక్స్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో తయారీ రంగానికి ఊతం లభించడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేరళ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కిటెక్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులకు వివరించడంతో పాటు.. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి భాగస్వాములు కావాలని మంత్రి చేసిన ఆహ్వానం చర్చనీయాంశంగా మారింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ