పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 52 ఏళ్ల జెమీమా.. ఐరిష్-ఆస్ట్రేలియా వ్యాపారవేత్త కామెరాన్ ఓ'రెయిల్లీని వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. తాజాగా జెమీమా కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. జెమీమా గోల్డ్‌స్మిత్, ఇమ్రాన్ ఖాన్ 1995లో వివాహం చేసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం 2004లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి సులేమాన్, కాసిం అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల తర్వాత కూడా పిల్లల విషయంలో ఇద్దరూ తమ బాధ్యతలను కొనసాగించారు. జెమీమా గోల్డ్‌స్మిత్ ఫిల్మ్ మేకర్‌గా, రచయిత్రిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా మానవ హక్కుల అంశాలపై కూడా ఆమె పనిచేస్తున్నారు. మీడియా, సామాజిక అంశాలపై ఆమెకు మంచి పరిచయం ఉంది. తాజాగా కామెరాన్ ఓ’రెయిల్లీతో ఆమె వివాహం చేసుకున్న విషయం బయటకు రావడంతో ఈ వార్త అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుటుంబం విడుదల చేసిన వివాహ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఐరిష్-ఆస్ట్రేలియా వ్యాపారవేత్తను వివాహమాడిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
الثلاثاء، 15 سبتمبر 2026
divorced in 2004 Imran Khan's ex-wife marries Irish-Australian businessman international Jemima Goldsmith and Imran Khan were married in 1995
ليست هناك تعليقات:
إرسال تعليق