రోమాంచకం సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. సందీప్ రెడ్డి వంగా నిర్మాణంలో, వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా ఉందంటూ మహేశ్ ప్రశంసించారు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సందర్భంగా మహేశ్ చేసిన పోస్ట్‌తో చిత్రబృందంలో మరింత ఉత్సాహం నెలకొంది. విడుదలకు ముందే మంచి అంచనాలు తెచ్చుకున్న ఈ సినిమాకు మహేశ్ నుంచి వచ్చిన ప్రశంసలు చిత్రానికి మరింత బజ్ తీసుకొచ్చాయి. ఈ సినిమా గురించి మహేశ్ బాబు తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. "'రోమాంచకం' ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. సందీప్, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, మొత్తం టీమ్‌కు నా శుభాకాంక్షలు. ఈ ప్రాజెక్ట్ కోసం పడిన కష్టం, ప్రేమ, ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ నుంచి ఊహించని మద్దతు లభించడంతో 'రోమాంచకం' చిత్ర బృందం తీవ్ర ఆనందం వ్యక్తం చేసింది. సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ 'భద్రకాళి పిక్చర్స్' మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది. "మా ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైన క్షణం. దీనిని మేము చాలా కాలం గుర్తుంచుకుంటాం. మా టీమ్ ముఖంలో ఇంత పెద్ద చిరునవ్వు తీసుకొచ్చినందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొంది.
రోమాంచకం సినిమా : ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా ఉందంటూ మహేశ్ ప్రశంస
الخميس، 3 سبتمبر 2026
'Romanchakam' Movie Andhra Pradesh cinema Mahesh Praises It as Entertaining and Promising Sharing his thoughts on his 'X' (Twitter) account telangana
ليست هناك تعليقات:
إرسال تعليق