తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పెద్ద చెరువు సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ గాయత్రిగుట్టకు చెందిన వరం శెట్టి దీపక్ గూడ్స్ రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం. దీపక్ గూడ్స్ రైలు కిందకు ఎలా వెళ్లాడు? ప్రమాదవశాత్తు జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు సమాచారం సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం మృతికి గల అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
గూడ్స్ రైలు కింద పడి యువకుడి దుర్మరణం
الخميس، 3 سبتمبر 2026
crime Mahabubabad district Pedda Cheruvu in Kesamudram telangana Young Man Dies After Falling Under Goods Train
ليست هناك تعليقات:
إرسال تعليق