తనపై దొంగతనం నేరం మోపడం మానసికంగా ఎంతో కలచివేసింది : అంబిక
الأربعاء، 23 سبتمبر 2026
all allegations leveled against her and publicly challenged Radha Ambika Being accused of theft was deeply distressing cinema tamilnadu
నటి అంబిక తనపై వచ్చిన అభియోగాలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ, రాధ ఫిర్యాదును న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బహిరంగంగా సవాల్ విసిరారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన కుటుంబ వివాదాన్ని మీడియా ముందుకు తీసుకురావడం తీవ్ర బాధ కలిగించిందని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. రాధ నివాసంలోని గదిలోకి చొరబడి తాను చెక్కులను దొంగిలించాననడంలో ఎంతమాత్రం వాస్తవం లేదని చెప్పారు. అసలు రాధకు తెలియకుండా ఆమె గదిలో నుంచి చెక్కులు ఎలా తీసుకోగలమని ప్రశ్నించిన అంబిక, స్వయంగా రాధే ఆ చెక్కులను తనకు అందజేసిందని వెల్లడించారు. ''చెక్కులను స్వయంగా ఇచ్చింది రాధే, ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి పేమెంట్లను ఉద్దేశపూర్వకంగా ఆపేసింది కూడా రాధే'' అని స్పష్టం చేశారు. సొంత తోబుట్టువు అయి ఉండి తనపై దొంగతనం నేరం మోపడం మానసికంగా ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. ఈ చెక్కుల వివాదం వెనుక సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కుటుంబ ఆస్తులు, వ్యాపార లావాదేవీల అంశాలు ఉన్నాయని అంబిక వివరించారు. ముఖ్యంగా 'ఏఆర్ఎస్ గార్డెన్స్'తో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ సంస్థను తన కన్నబిడ్డలా భావించానని భావోద్వేగానికి లోనయ్యారు. అటువంటి సంస్థ పేరును తన ప్రమేయం లేకుండా 'ఆర్ఆర్ గార్డెన్స్'గా మార్చడం తనను ఎంతగానో క్షోభకు గురిచేసిందన్నారు. అలాగే ఆస్తులు, వ్యాపారంతో పాటు బంగారు ఆభరణాల విషయంలోనూ తమ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని, తమ కుటుంబానికి చెందిన విలువైన బంగారు నగలు కూడా రాధ వద్దే ఉన్నాయని ఆమె ఎదురు ఆరోపణలు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి తాను గతంలోనే సంబంధిత అధికారులను సైతం ఆశ్రయించానని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన పోరాటానికి అంబిక సిద్ధమయ్యారు. రాధ ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో, ఆమెపై చట్టప్రకారం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అంబిక తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. రాధ పోలీసులకు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును న్యాయస్థానంలో సవాలు చేస్తామని తెలిపారు. ఇకపై ఈ కుటుంబ సమస్యను పదేపదే మీడియా ముందుకు తీసుకురాబోనని, చట్టం, అధికారుల నిర్ణయానికే తుది న్యాయాన్ని వదిలేస్తున్నానని అంబిక స్పష్టం చేశారు.
ليست هناك تعليقات:
إرسال تعليق