సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా పదేపదే ఇంటర్నెట్ అంతరాయం : తీవ్ర ఆగ్రహానికి గురై పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోయిన మహిళ

త్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా పదేపదే ఇంటర్నెట్ అంతరాయాలు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంగ్లో బాయి అనే మహిళ పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోయింది. మొబైల్ ఫోన్ వినియోగం, కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం, మానసిక ఆరోగ్యంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. నెట్‌వర్క్ అంతరాయాలపై కోపంతో, మంగ్లో బాయి తన ఫోన్‌ను నేలకేసి కొట్టి, తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ఆ తర్వాత ఆమె పురుగుమందు తాగింది. కొంతసేపటికి పరిస్థితి మరింత విషమించి, వాంతులు చేసుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులకు పురుగుమందు వాసన రావడంతో ఆమె భర్త ప్రేమ్‌లాల్ వాంతులు చేయించడానికి ఆవు పేడ నీళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత మొదట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు, మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రి నుంచి అందిన మెమో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments