వచ్చే నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలకు సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికన్లు ఇరాన్ యుద్దంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ సతమతం అవుతున్నారు. ఎన్నికల తరుణంలో ఈ యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవాలని ట్రంప్ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇరాన్ వార్ వల్ల వల్ల ఓటర్లలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో నష్టపోకుండా చూసుకోవాలని ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న సుదీర్ఘ యుద్దంపై అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన ఒక పోలింగ్ విశ్లేషణ ప్రకారం కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధాన్ని సమర్థిస్తుండగా, 63 శాతం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పెరిగిన పెట్రోలు ధరలు కూడా ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెనేట్, ప్రతినిధుల సభలో తమ స్వల్ప మెజారిటీని కాపాడుకోవాలని చూస్తున్న రిపబ్లికన్లకు ఈ వార్ పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక చర్యల కంటే ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడమే మేలని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా భవిష్యత్తులో జరిగే చర్చల సమయానికి ఇరాన్‌పై బలమైన ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వంటి కీలక నేతలు కూడా ఎన్నికలు ముగిసే వరకు ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలను సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచడానికే మొగ్గు చూపుతున్నారు. అటు నిరంత యుద్దం కారణంగా అమెరికా సైనిక విభాగాల్లో ఆధునిక ఆయుధ కొరత ఏర్పడుతుండటం నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్దం కొనసాగితే ఇతర ఉద్రిక్త ప్రాంతాలలో అమెరికా భద్రతా దళాల యుద్ధ సంసిద్ధత తీవ్రంగా దెబ్బతింటుందని రక్షణశాఖ ఇప్పటికే వైట్ హౌస్‌ను హెచ్చరించింది. దీంతో తమ ఆయుధ నిల్వలను తిరిగి సమకూర్చుకోవడానికి కూడా అమెరికాకు కొంత సమయం అవసరమని అధికారులు భావిస్తున్నారు. దీంతో నవంబర్ మూడున జరగబోయే ఓటింగ్ ముగిసిన తర్వాత అమెరికా ఇరాన్ పై తదుపరి సైనిక చర్యలను తిరిగి తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్న ట్రంప్
الأربعاء، 2 سبتمبر 2026
administration is working hard to mitigate voter backlash international Trump Grapples with How to Navigate the Situation US Midterm Elections in November
ليست هناك تعليقات:
إرسال تعليق